2005లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ విడుదల అయింది. ఇందులో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడి పాత్రలో నటించారు. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. శరణార్థిగా వచ్చిన శివ (బెల్లంకొండ శ్రీనివాస్) ఛత్రపతిగా ఎలా ఎదిగాడన్నదే కథ. ‘ఛత్రపతి’ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఎన్నో సార్లు టీవీల్లో కూడా చూసేసి ఉంటాం. ఒక తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయడమే వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ సినిమాను ఎలా తీసి ఉంటారో అని హిందీ కంటే తెలుగు ఆడియన్స్‌కే ఎక్కువ ఆసక్తి నెలకొంది. కానీ శ్రీనివాస్, వినాయక్ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచారు. ఒరిజినల్ ఇచ్చిన ఇంపాక్ట్‌లో కనీసం 10 శాతం కూడా ఇందులో కనిపించదు. ఏబీపీ దేశం రేటింగ్: 2/5