ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక ప్రధాన తారలుగా కృష్ణవంశీ తీసిన సినిమా 'రంగమార్తాండ'.

కథ : రాఘవరావు (ప్రకాష్ రాజ్) గొప్ప రంగస్థల కళాకారుడు. ఆయన స్నేహితుడు చక్రి (బ్రహ్మానందం) కూడా స్టేజి ఆర్టిస్ట్.

నాటకాలే శ్వాసగా జీవించిన రాఘవరావును రంగమార్తాండ బిరుదుతో సత్కరిస్తారు. తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారు.

సంపాదనంతా వారసులకు రాసి ఇచ్చిన తర్వాత రాఘవరావుకు నిజ జీవితంలో ఎటువంటి పాత్ర లభించింది?

వారసుల వల్ల రాఘవరావు ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నారు? భార్య రాజు (రమ్యకృష్ణ), చక్రి ఏం చేశారు? అనేది సినిమాలో చూడాలి. 

ఎలా ఉంది? : కథ, కథనం, నిర్మాణ విలువలను నటీనటుల ప్రతిభ డామినేట్ చేసిన చిత్రమిది. 

వారసుల నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల కథ, వ్యధను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు.

కథగా చూస్తే సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. కానీ, కృష్ణవంశీ తెరకెక్కించిన తీరు కంటతడి పెట్టిస్తుంది.

స్టేజిపై అనేక పాత్రలు వేసి, జీవితంలో నటించలేక సతమతమయ్యే పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించారు.

చక్రి పాత్రలో బ్రహ్మానందం నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. కొన్ని సీన్లలో ప్రకాష్ రాజ్‌ను డామినేట్ చేశారు.

ఇళయరాజా సంగీతం హాయిగా ఉంది. నటీనటుల కోసం చూడాల్సిన చిత్రమిది. కృషవంశీ ఈజ్ బ్యాక్, బ్రహ్మి రాక్స్!