'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' తర్వాత నాగశౌర్య, అవసరాల చేసిన సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. కథ : బీటెక్‌లో సంజయ్ (నాగశౌర్య)కు అనుపమ (మాళవిక) సీనియర్. కాలేజీలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఎంఎస్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ప్రేమలో పడి, సహ జీవనం చేస్తారు. పూజ (మేఘా చౌదరి) రాకతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. సంజయ్, అనుపమ మళ్ళీ కలిశారా? లేదా? వాళ్ళ మధ్య గొడవలకు కారణం ఏమిటి? ఏమైంది? అనేది కథ. ఎలా ఉంది? : శ్రీనివాస్ అవసరాల సినిమాల్లో కథ కంటే కథనం, కామెడీ చాలా బాగుంటాయి. సీన్లను కొత్తగా ప్రజెంట్ చేస్తారు. 'పాప'లోనూ అవసరాల మార్క్ సీన్లు ఉన్నాయి. కానీ, కథలో బలం లేదు. ప్రేమికుల మధ్య గొడవకు సరైన కారణం లేదు. కథ చెప్పే విషయంలో అవసరాల చాలా కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్ సరిగా రాసుకోలేదు. మాళవిక నటనకు వంక పెట్టడానికి లేదు. కానీ, లుక్స్ విషయంలో చేంజ్ చూపించలేదు. నాగశౌర్య లుక్స్ పరంగా వేరియేషన్స్ చూపించారు. నటుడిగా మెప్పించారు. శౌర్యకు ఇది పర్‌ఫెక్ట్ రోల్. అవసరాల కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను 'పాప' డిజప్పాయింట్ చేస్తుంది. కొన్ని సన్నివేశాల కోసమే 'పాప'.