కార్తీ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ థియేటర్లలో విడుదల అయింది.

విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్. తండ్రి (మరో కార్తీ) దేశద్రోహి అని సమాజం మొత్తం తనను వేధిస్తూ ఉంటుంది.

తనను తాను మంచివాడిగా ప్రూవ్ చేసుకోవాలని ప్రతి చిన్న పనిని పబ్లిసిటీ చేసుకుంటూ ‘Face of AP Police’గా మారతాడు.

అసలు సర్దార్ (మరో కార్తీ) ఎవరు? తనకు, ఒయాసిస్ అనే వాటర్ కంపెనీకి సంబంధం ఏంటి?

నీటి అమ్మకం కాన్సెప్ట్‌కు గూఢచారి నేపథ్యాన్ని జోడించి పీఎస్ మిత్రన్ సినిమాను అత్యంత ఆసక్తికరంగా మలిచాడు.

కార్తీ పబ్లిసిటీ కోసం చేసే చిన్న చిన్న పనులను ఫన్నీగా చూపించడంతో సినిమా ప్రారంభం అవుతుంది.

ఇంటర్వెల్ ముందు సర్దార్ పాత్ర ఇంట్రడక్షన్ ఫైట్ సినిమా గ్రాఫ్‌ను అమాంతం పైకి తీసుకెళ్తుంది.

సెకండాఫ్‌లో సర్దార్ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో కొన్ని సీన్లు, పాటలు కథాగమనానికి అడ్డుపడతాయి.

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

ఏబీపీ దేశం రేటింగ్: 3.25/5
(All Images Credits: Prince Pictures)