నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. విక్రమ్ (నాగార్జున) ఒక ఇంటర్‌పోల్ ఏజెంట్. తోటి ఇంటర్‌పోల్ ఆఫీసర్ ప్రియ(సోనాల్ చౌహాన్)తో రిలేషన్ షిప్‌లో ఉంటాడు. ఒక డిప్లొమాట్ కొడుకును కాపాడాల్సిన మిషన్‌లో అనుకోని పరిణామాల మధ్య ఆ పిల్లాడు చనిపోతాడు. దీంతో అండర్‌వరల్డ్ మీద యుద్ధం చేయడానికి సిద్ధం అవుతాడు. ఇంటర్‌పోల్ జాబ్‌కు కూడా రిజైన్ చేస్తాడు. విక్రమ్ అక్క అను (గుల్ పనాగ్), తన కూతురు అదితికి (అనిఖా సురేంద్రన్) ప్రాణ హాని ఉందని విక్రమ్‌కు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఫ్యామిలీ సన్నివేశాలు స్పీడ్ బ్రేకర్లలాగా అనిపిస్తాయి. రొమాంటిక్ సీన్లు యూత్‌ను ఆకట్టుకుంటాయి. ఘోస్ట్ పాత్రలో నాగార్జున ఆకట్టుకుంటాడు. మిగతా నటీనటులు పాత్రల మేరకు నటించారు. ఏబీపీ దేశం రేటింగ్: 3/5