‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ కథ అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది.



ఖుషి సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచి సినిమా మార్నింగ్ షో పడే వరకు జరిగే కథ ఇది.

శ్రీను (శ్రీకాంత్ రెడ్డి), తను ప్రేమించే అమ్మాయి లయ (సంచితా బసు) ఇద్దరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే.

ఖుషి సినిమా మొదటి రోజు మొదటి ఆట శ్రీనుతో కలిసి చూడాలని, దానికి టికెట్లు సంపాదించమని శ్రీనును లయ అడుగుతుంది.

దానికి శ్రీను ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది తెరపై చూడాల్సిందే.

జాతి రత్నాలు మ్యాజిక్ మాత్రం ఇక్కడ అస్సలు వర్కవుట్ కాలేదు.

టికెట్ల కోసం హీరో చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టించాలి. కానీ భారీగా విసిగిస్తాయి.

రథన్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి.



ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇందులో ప్రధాన పాత్రల్లో ఉన్నది కొత్త నటీనటులే అయినా బాగా నటించారు.



పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చూడటం కంటే ఇంట్లో కూర్చుని ఖుషి సినిమానే మళ్లీ చూడటం బెటర్.