దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతా రామం’ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.



లవ్ స్టోరీలు తీయడంలో ఎక్స్‌పర్ట్ అయిన హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.



అనాథ అయిన లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్), ఎలా ఉంటుందో తెలియని సీత (మృణాల్) ప్రేమలో పడ్డాక ఏమైంది అనేదే కథ.



హను రాఘవపూడి పొయెటిక్ టేకింగ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.



ఎమోషనల్ సీన్లను తెరకెక్కించిన విధానం హైలెట్.



విశాల్ చంద్రశేఖర్ పాటలు అదరగొట్టాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది.



పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణల సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించింది.



లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.



ఇక సీతగా మృణాల్ ఠాకూర్ మెప్పించింది. తన నటన చాలా మెచ్యూర్డ్‌గా ఉంది.



ఏబీపీ దేశం రేటింగ్: 3.5/5