ఉసిరిలో న్యూట్రిషిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి.

వీటిలోని విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు హెయిర్​ ఫాలికల్స్​ను దృఢంగా చేసి జుట్టు పెరిగేలా చేస్తాయి.

జుట్టును షైనీగా, మాయిశ్చరైజ్ చేస్తుంది ఉసిరి. పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

ఉసిరిలోని యాంటీఫంగల్​, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును, దురదను తగ్గిస్తాయి.

జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు జుట్టును హెల్తీగా చేసి యంగ్​ లుక్​ని ఇస్తాయి.

ఉసిరిలోని విటమిన్ సి జుట్టును డ్యామేజ్ చేయడాన్ని తగ్గిస్తుంది. స్ప్లిట్ ఎండ్స్​ని కంట్రోల్ చేస్తుంది.

ఉసిరి నూనెను స్కాల్ప్​కు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల జుట్టు పెరిగి, చుండ్రు తగ్గుతుంది.

ఉసిరిపొడిని కొబ్బరి నూనెలో లేదా ఆలివ్​ నూనెలో కలిపి హెయిర్ మాస్క్​గా వేసుకుంటే జుట్టు పొడిబారడం తగ్గుతుంది.

ఉసిరి జ్యూస్​తో హెయిర్​ని వాష్ చేస్తే.. జుట్టు పెరుగుదల బాగుంటుంది. దురద తగ్గుతుంది.

కొబ్బరి నూనెలో ఉసిరి పొడి వేసి.. దానిని జుట్టుకు అప్లై చేస్తే మంచి కండీషన్​ అందుతుంది.