కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు ఇవే.. జాగ్రత్త

చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి అనేక కారణాలున్నాయి.

అయితే తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ వల్లే కిడ్నీ సమస్యలు వస్తాయట.

కొన్ని సందర్భాల్లో వాష్​రూమ్​కి వెళ్లే అవకాశమున్నా చాలామంది యూరినేషన్​ని ఆపేసుకుంటారు.

ఇలా మూత్రంకి వెళ్లకుండా ఆగిపోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు.

ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకున్నా కూడా కిడ్నీ సమస్యలు వస్తాయట.

కొన్నిరకాల మందులు రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి.

నాన్​వెజ్​ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు.

స్మోకింగ్, ఆల్కహాల్ వంటి హ్యాబిట్స్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయట.

సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్తున్నారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది. (Images Source : Envato)