తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

థైరాయిడ్, హార్మోనల్ సమస్యలను ఇలా కంట్రోల్ చేయండి డైట్​లో మార్పులు

Published by: Geddam Vijaya Madhuri

డైట్​లో మార్పులు

టెస్టోస్టిరాన్​లో మార్పులు, ఈస్ట్రోజన్ సమస్యలు, హార్మోనల్ ఇబ్బందులు, పీరియడ్స్ సమస్యలు థైరాయిడ్​ ఉంటే ఈ ఫుడ్స్ డైట్​లో చేర్చుకోవాలంటున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో జింక్ ఉంటుంది. ఇది టెస్టోస్టిరాన్​ను పెంచుతుంది. సూప్స్, సలాడ్స్​లలో దీనిని తీసుకోవచ్చు. ఫ్రై చేసుకుని క్రంచీ స్నాక్స్​గా కూడా లాగించవచ్చు.

బ్రెజిల్ నట్స్

బ్రెజిల్ నట్స్​లో సెలినియం ఉంటుంది. థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని డైట్​లో చేర్చుకుంటే సమస్య కంట్రోల్​లో ఉంటుంది.

అవిసె గింజలు

అవిసెగింజలు అందానికి, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఈస్ట్రోజన్​ను విడుదల చేసి.. హార్మోన్​లను బ్యాలెన్స్ చేస్తాయి.

నువ్వులు

నువ్వులు కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్​ని పెంచుతాయి. హార్మోనల్ వంటి సమస్యలను ఇ వి దూరం చేస్తాయి. వీటిని లడ్డూలుగా రోజూ తీసుకుంటే కాల్షియం కూడా అందుతుంది.

బాదం

రోజూ ఉదయాన్నే బాదం తింటే శరీరానికి మెగ్నీషియం అందుతుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్​ను అదుపులో ఉంచుతుంది.

సన్​ ఫ్లవర్ సీడ్స్

పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది ప్రొజెస్టిరాన్​ను విడుదల చేసి.. హార్మోన్లను అదుపులో ఉంచుతుంది.

వాల్ నట్స్

వీటిలో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి పీరియడ్ సమస్యలను దూరం చేసి.. హార్మోన్లను అదుపులో ఉంచుతాయి.

అవగాహన

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.