జాయింట్ పెయిన్స్కి ఇలా చెక్ పెట్టేయండి వయసు పెరిగే కొద్ది లేదా ఇతర కారణాల వల్ల కొందరికి జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. శారీరక, మానసిక సమస్యలు కూడా కీళ్లపై ప్రభావం చూపించి ఒత్తిడికి గురిచేస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా కూడా మారే అవకాశముంది. అందుకే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చట. పాలల్లో పసుపు కలిపి గోరువెచ్చగా తాగితే కీళ్లకు చాలా మంచిదట. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. నూనెలో పసుపు కలిపి.. దానితో కీళ్లకు మసాజ్ చేస్తే మంచి రిలీఫ్ ఉంటుందట. రెగ్యూలర్గా ఫాలో అయితే మంచిది. అలాగే అల్లం కూడా కీళ్ల సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ని కలిపి మసాజ్ చేసుకుంటే ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు. చాలామంది కీళ్లనొప్పులు ఉంటే టోమాటాలు తినరు. కానీ టోమాటోలు కీళ్లనొప్పులను దూరం చేస్తాయట. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.