హెల్తీ ఫుడ్స్ లిస్ట్

కొవ్వును తగ్గించి గుండెను హెల్తీగా ఉంచే ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

ప్రాణాంతక సమస్యలు

కొలెస్ట్రాల్​ని తక్కువ అంచనా వేయకూడదు. ఇది శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా గుండెకు రక్తప్రసరణకాకుండా అడ్డుకుని ప్రాణాంతక సమస్యలు తెస్తుంది.

కొవ్వును కంట్రోల్ చేసే ఫుడ్స్

అందుకే కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉండడంతో గుండె ఆరోగ్యానికి మంచివంటున్నారు నిపుణులు. అలాగే తీసుకోకూడని ఫుడ్స్​ కూడా కొన్ని ఉన్నాయి.

ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్

సాల్మన్, ట్యూన్ వంటి చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నట్స్, సీడ్స్, అవకాడోలు, ఆలివ్ ఆయిల్​లో కూడా ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్

తోటకూర, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెర్రీలు, యాపిల్స్, ద్రాక్షలు, దానిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ కూడా మంచి ఆప్షన్స్. క్యాప్సికమ్, క్యారెట్స్, చిలగడ దుంపలను కూడా తీసుకోవచ్చు. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు హార్ట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి.

ఫైబర్ ఫుడ్స్

ఫైబర్ ఫుడ్స్ బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్​ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. డీటాక్స్ రూపంలో కొవ్వును బయటకు పంపేస్తాయి. క్వినోవా, బ్రౌన్ రైస్, గోధుమలు, శనగలు, బీన్స్, యాపిల్స్, అరటిపళ్లు, బ్రోకలీ, స్ప్రౌట్స్ ఫైబర్ ఫుడ్స్​కి బెస్ట్ ఆప్షన్.

పొటాషియం

పొటాషియం రిచ్ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకుంటే గుండె సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అరటిపండ్లు, తోటకూర, చిలగడదుంపలు, అవకాడోల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

ఒమేగా 3 ఫుడ్స్

ఒమేగా 3 కొవ్వును కరిగించి గుండెకు మేలు చేస్తుందని చాలామందికి తెలుసు. ఇవి చేపల్లో, వాల్​నట్స్, చియాసీడ్స్, అవిసెగింజల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని కచ్చితంగా తీసుకోవాలి.

ఇవేకాకుండా

చికెన్, ఆల్మండ్ మిల్క్, గ్రీక్ యోగర్ట్​లలో హెల్తీ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి కూడా గుండె ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి.

ఇవి వద్దు..

హెల్తీ ఫుడ్స్ తీసుకోవడంతోపాటు.. కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ప్రొసెస్ చేసిన మీట్స్, ఫ్రైడ్ ఫుడ్, షుగర్ డ్రింక్స్, కార్బోహైడ్రేట్స్, సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది.

అవగాహన కోసమే

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మరింత మంచిది. (Images Source : Envato)