బరువు తగ్గాలనుకుంటే.. పరగడుపున అల్లం టీ తాగేయండి మీకు రోజూ టీ తాగే అలవాటు ఉందా? అయితే ఆ అలవాటును అల్లం టీతో రిప్లేస్ చేయండి. అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఉదయాన్నే పరగడుపున అల్లంటీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. వేగంగా బరువు తగ్గడంలో ఇది హెల్ప్ చేస్తుందట. ఒబెసిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం దూరమవుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి, బలాన్ని అందిస్తుంది. సీజనల్ వ్యాధులను రాకుండా కాపాడుతుంది. కీళ్లనొప్పులను దూరం చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అల్లం టీలో ఉంటాయి. రక్తప్రసరణ పెరిగి.. గుండెకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. రెగ్యూలర్గా దీనిని తీసుకోవడం వల్ల స్కిన్, హెయిర్కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. (Images Source : Envato)