అయితే వీటిని వేయించుకుని.. ఉడకబెట్టుకుని కాకుండా.. నానబెట్టుకుని తింటే మంచిదంటున్నారు.

పల్లీలు. వీటినే వేరుశనగలు అంటారు. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు.

సాధారణంగా స్ప్రౌట్స్​లో పల్లీలను కూడా నానబెట్టి తీసుకుంటారు.

వీటిలో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలుంటాయి.

అయితే ఆరోగ్యానికి వివిధ ప్రయోజనాలు కావాలనుకునేవారు కూడా వీటిని నానబెట్టి తినొచ్చట.

వీటిని నానబెట్టుకుని రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గి.. జీర్ణక్రియ మెరుగవుతాది.

కండరాల సమస్యలు ఉన్నవారు కూడా పల్లీలను నానబెట్టుకుని తినవచ్చు.

నానబెట్టిన పల్లీల్లోని ప్రోటీన్ జుట్టు, గోళ్లు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్​ తక్కువగా ఉండేవారు దీనిని తింటే చాలా మంచిదట.

శరీరంలో నీరసాన్ని పోగొట్టి.. బలాన్ని పెంచుతుంది. జిమ్​కెళ్లేవాళ్లు కూడా దీనిని తీసుకోవచ్చు.

కాల్షియం, మెగ్నీషియం కలిసి ఎముకలను స్ట్రాంగ్​గా చేస్తాయని చెప్తున్నారు.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుని ఫాలో అయితే మంచిది.