సింపుల్ రోటీన్ టిప్స్

మగవారికి స్కిన్ కేర్ రోటీన్.. మీరు కూడా ఫాలో అవ్వాలి గురూ

Published by: Geddam Vijaya Madhuri

క్లెన్సింగ్..

మీ స్కిన్​కి ఏ క్లెన్సర్ సెట్ అవుతుందో చూసుకోని దానిని ఉపయోగించాలో. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఫోమింగ్ క్లెన్సర్ వాడితే మంచిది. ఆయిల్ కంట్రోల్ ఉంటుంది.

సన్ స్క్రీన్

క్లెన్సింగ్ తర్వాత మగవారు కచ్చితంగా సన్​స్క్రీన్ అప్లై చేయాలి. ఎండలో ఎక్కువగా ఎక్స్​పోజ్ అవుతారు కాబట్టి.. టూ ఫింగర్స్ రూల్ ఫాలో అవుతూ దానిని అప్లై చేసుకోవాలి.

నైట్ రోటీన్

మీరు వర్క్​నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉదయం మాదిరిగానే మీ ముఖాన్ని క్లెన్సర్​తో క్లీన్ చేసుకోవాలి.

మాయిశ్చరైజర్

అనంతరం ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. non-comedogenic moisturizerలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. లైట్​గా ఉన్నా.. ఎక్కువసేపు ప్రభావవంతంగా ఉంటాయి.

అది మరువద్దు

కొందరు కాలేజ్​ నుంచి వచ్చిన తర్వాత.. లేదా ఆఫీస్​ నుంచి వచ్చిన తర్వాత కనీసం స్నానం కూడా చేయకుండా ఉంటారు. అది స్కిన్​ని మరింత ఎఫెక్ట్ చేస్తుంది.

హైడ్రేషన్

పనిలో పడో.. మరే ఇతర కారణాల వల్లనో చాలామంది నీటిని తాగరు. కానీ రెగ్యూలర్​గా నీటిని తాగుతూ ఉంటే స్కిన్​ హెల్తీగా ఉంటుంది.

ఫ్రైడ్ ఫుడ్

కొందరు బయట దొరికే ఫుడ్స్​ని ఎక్కువగా తీసుకుంటారు. ఇవి రెగ్యూలర్​గా తీసుకుంటే స్కిన్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. వృద్ధాప్యఛాయలు త్వరగా వస్తాయి.

ముఖానికి మాస్క్

డస్ట్ ఉండే ప్రాంతాల్లో లేదా బైక్​పై వెళ్లేప్పుడు చాలామంది హెల్మెట్ కూడా ఉపయోగించరు. దీనివల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఏదైనా మాస్క్ లేదా హెల్మెట్ వాడుతూ ఉండాలి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు, సలహాలు ఫాలో అయితే మంచిది.