పంచదార లేకుండా టీని నెలరోజులు తాగితే ఏమవుతుందో తెలుసా?

కొందరు టీ లేకుండా ఉండలేరు. దానిలో రంగు, రుచి, చిక్కదనం కచ్చితంగా ఉండాలి.

షుగర్ విషయంలో కూడా రాజీపడరు. కచ్చితంగా రుచికి తగినంత షుగర్ ఉండాలనుకుంటారు.

అయితే నెలరోజులు షుగర్ లేకుండా టీని తాగితే ఏమవుతుందో తెలుసా?

షుగర్ లేకుండా టీ తాగితే డయాబెటిస్ పేషెంట్లకు కచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది.

పంచదార లేకపోవడం వల్ల క్యాలరీలు తగ్గుతాయి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి.

శరీరంలోని pH లెవెల్స్​ బ్యాలెన్స్​లో ఉంటాయి. వీటిని షుగర్స్ డిస్టర్బ్ చేస్తాయి.

కొందరికి టీ తాగితే గ్యాస్ సమస్య వస్తుంది. అలాంటి వారు షుగర్ లేకుండా టీ తాగితే సమస్య తగ్గుతుంది.

మంట, వాపు వంటి తగ్గుతాయి. షుగర్స్​ వల్ల ఈ సమస్య ఉన్నవాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

చక్కెరతో కూడిన టీ తాగితే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం రావొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Envato)