మగవారికంటే ఆడవారే ఎక్కువ సేపు నిద్రపోవాలని చెప్తున్నాయి అధ్యయానాలు. తాజాగా డ్యూక్ యూనివర్సిటీ చేసిన పరిశోధన కూడా ఇదే అంశాన్ని మరోసారి తెలిపింది. మగవారి కంటే ఆడవారి బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుందని.. అందుకే నిద్ర ఎక్కువ అవసరమని తెలిపింది. ఆఫీస్ పనులతో పాటు.. ఇంటిపనులు ఇతర కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీంతో పగలంతా మెదడు సామర్థ్యం మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా ఉంటుందంట. అందుకే వారు మగవారికంటే ఎక్కువ సమయంలో నిద్రపోవాలని అధ్యయనం చెప్తుంది. నిద్ర తక్కువైతే.. మహిళల్లో నిరాశ, కోపం పెరిగిపోతాయని తెలిపింది ఈ తాజా అధ్యయనం. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతాయని.. యాంగర్ ఇష్యూలు పెరుగుతాయని వెల్లడించారు. మరికొందరిలో డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు ఎక్కువ అవుతాయని నిపుణులు తెలిపారు. వీటినుంచి కోలుకోవాలంటే నిద్రతోనే సాధ్యమని.. అందుకే వారు ఎక్కువగా నిద్రపోవాలని చెప్తున్నారు. సరైన నిద్ర లేకుంటే పీరియడ్స్, ప్రెగ్నెన్సీ వంటి హార్మోన్ల మార్పులు కూడా ఉంటాయట.