దసరాను తొమ్మిదిరోజులు చేస్తారు. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కనిపిస్తారు.

అమ్మవారి అవతారాలకు తగ్గట్లుగానే అమ్మవారికి నైవేద్యాలు కూడా భక్తులు సమర్పిస్తారు.

మొదటిరోజు బాలాత్రిపుర సుందరీ దేవి రూపంలో ఉన్న అమ్మవారికి క్షీరాన్నం పెడతారు.

రెండోరోజు వేదమాత శ్రీ గాయత్రీ దేవి రూపంలోని అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదిస్తారు.

మూడోరోజు అన్నపూర్ణ మాతకు అల్లం గారెలు సమర్పిస్తారు.

నాలుగోరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి కదంబ ప్రసాదాన్ని పెడతారు.

అయిదోరోజు అమ్మవారు చండీ దేవిగా దర్శనమిస్తారు. చింతపండు పులిహోర, రవ్వకేసరి నైవెద్యాలు పెడతారు.

ఆరో రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవిగా కనిపిస్తారు. అమ్మవారికి పూర్ణం బూరెలు ఇష్టంగా సమర్పిస్తారు.

ఏడోరోజు సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు కనిపిస్తారు. నైవేద్యంగా దద్దోజనం పెట్టాలి.

ఎనిమిదో రోజు దుర్గావతారంలో అమ్మవారు ముస్తాబవుతారు. నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా పెట్టాలి.

తొమ్మిదోరోజు మహిహిషాసుర మర్దినిగా కనిపిస్తారు. ఆరోజు చక్కెర పొంగలిని పెడతారు.