సింపుల్ టిప్స్

జుట్టుపెరుగుదలను సహజంగా ప్రోత్సాహించే టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రెగ్యూలర్​గా ఫాలో అయితే

రెగ్యూలర్​గా ఈ టిప్స్ ఫాలో అయితే జుట్టుకి చాలా మంచిదని చెప్తున్నారు. ఓ రోజు చేసి ఆపేస్తే ఫలితాలు కనిపించవు.

మసాజ్

జుట్టుకు రెగ్యూలర్​గా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

గుడ్లు

ప్రోటీన్​తో నిండి ఉన్న గుడ్లు కూడా హెల్తీ హెయిర్​ని ప్రమోట్ చేస్తాయి. ఇవే కాకుండా చేపలు, తోటకూర వంటివి కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

కొబ్బరి నూనె

జుట్టును రెగ్యూలర్​గా నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇది జుట్టుకు మంచి డీప్ కండీషన్​ని ఇస్తుంది. స్కాల్ప్​నుంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

హీటింగ్ టూల్స్

జుట్టును స్టైలిష్​గా చేసుకోవాలనో.. తడి ఆరబెట్టుకోవాలనో చాలామంది హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. అవి జుట్టును పాడు చేస్తాయి. కాబట్టి.. వాటి వాడకం తగ్గిస్తే మంచిది.

అలోవెరా

అలోవెరా జెల్​ను స్కాల్ప్​కి అప్లై చేసి తలస్నానం చేస్తే జుట్టు డ్యామేజ్ తగ్గుతుంది. హెల్తీ గ్రోత్ ఉంటుంది.

స్ప్లిట్ ఎండ్స్

జుట్టు చివర్ల చిట్లిపోతే.. దానిని కట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా హెల్తీగా ఉంటుంది.

వ్యాయామం

వ్యాయామం శరీరానికే కాదు జుట్టు, అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మెరుగైన రక్తప్రసరణ అంది జుట్టు పెరుగుతుంది.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలతో మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.