కంటి చూపును మెరుగుపరిచి.. కొవ్వును తగ్గించే కరివేపాకు పొడి.. మరిన్ని లాభాలు ఇవే

కరివేపాకు ఆరోగ్యానికి, అందానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

అయితే దీనిని నేరుగానే కాకుండా పొడులుగా కూడా చేసి వాడుకోవచ్చు.

కరివేపాకు ఎక్కువరోజులు నిల్వ ఉంంచుకోలేనివారు దానిని పొడిగా చేసుకుని వంటల్లో వాడుకోవచ్చు.

దీనివల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సమస్యలను దూరం చేస్తాయి.

మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. డయేరియా, వాంతులు, జీర్ణసమస్యలు దూరమవుతాయి.

కరివేపాకులోని విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. జుట్టుకి కూడా మంచిది.

మెటబాలీజం పెంచి.. బరువును తగ్గించడంలో కరివేపాకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

వీటిలోని యాంటీఆక్సిడెంట్, న్యూట్రెంట్స్ చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి.

కరివేపాకును నూనెలో కలిపి రెగ్యూలర్​గా అప్లై చేస్తే జుట్టు రాలదు. వైట్ హెయిర్ త్వరగా రాదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Soucre : Pinterest)