హార్ట్ ఎటాక్స్ అంటే మగవారికే ఎక్కువగా వస్తాయనుకుంటూ ఉంటారు.

కానీ మహిళలను కూడా హార్ట్ ఎటాక్స్​ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి.

అయితే కొన్ని లక్షణాలు హార్ట్​ ఎటాక్​కి సంకేతాలని.. వాటిని అశ్రద్ధ చేయొద్దని చెప్తున్నారు.

ఛాతీలో కాస్త అసౌకర్యంగా ఉంటే గ్యాస్ నొప్పి అనుకుంటారు కానీ అది హార్ట్​ ఎటాక్​కి సంకేతమేనట.

ఛాతీ దగ్గర ప్రెజర్ రావడం, పిండినట్టు, ఫుల్​గా ఉన్నట్టుల అనిపిస్తే అస్సలు ఇగ్నోర్ చేయొద్దట.

కేవలం ఛాతిలోనే కాదు.. శరీరంలోని ఇతర భాగాల్లో కూడా నొప్పులు రావొచ్చు. అవి కంటిన్యూ అవ్వొచ్చు.

చేతుల్లో, నడుము, మెడ, దవడ, కడుపులో ఉండే భాగాల్లో కూడా సడెన్​గా నొప్పి రావొచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. షార్ట్ బ్రీత్ కూడా గుండె సమస్యలకు సంకేతాలే.

వాంతులు వంటి లక్షణాలు, నలతగా అనిపిస్తున్నా అవి కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలే.

సడెన్​గా కాళ్లు, చేతులు చెమటలు పట్టేసి.. యాంగ్జైటీ వంటి లక్షణాలు కూడా దానిలో భాగమే.