పరగడుపునే రోజూ బొప్పాయి తినొచ్చా?
బొప్పాయి తింటే హెల్త్‌కి మంచిదే. కానీ.. ఖాళీ కడుపుతో తినొచ్చా? దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే అనేక బెనిఫిట్స్ ఉంటాయట. వాటిలో డిటాక్స్ కూడా ఒకటి. దీనివల్ల కడుపులోని టాక్సిన్లు బయటకు పోతాయి.
జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట.
బొప్పాయిలో కెలరీలు తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే దీనిని తీసుకోవడం వల్ల బరువును కంట్రోల్ చేయవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.
మధుమేహమున్నవారు కూడా పరగడుపున బొప్పాయి తినొచ్చట. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు సీజనల్ వ్యాధులనుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
బొప్పాయిలోని విటమిన్ సి, ఏ స్కిన్‌కు చాలా మంచిప్రయోజనాలు అందిస్తాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
బొప్పాయిని ప్రెగ్నెంట్‌తో ఉన్నవారు తినకపోవడమే మంచిదంటున్నారు. వీటిని తినే ముందు వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది. (Images Source : Unsplash)