మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే దీనిని వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకుంటారు. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి ప్రయోజనాలు ఇస్తుందట. అయితే దీనికోసం మెంతుల నీటిని ఎలా తీసుకోవాలో తెలుసా? టీస్పూన్ మెంతులను 250ఎమ్ఎల్ నీటిలో వేసి రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పరగడుపున దానిని రెగ్యూలర్‌గా తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలో కంట్రోల్లో ఉంటాయి. సమతుల్యమవుతాయి. రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతాయి. ఇవేకాకుండా బరువు తగ్గడంలో కూడా మెంతుల నీరు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు కూడా రోజూ దీనిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. స్కిన్, హెయిర్ ప్రయోజనాల కోసం కూడా దీనిని తీసుకోవచ్చు. పీరియడ్స్ సమస్యలతో ఇబ్బంది మహిళలు కూడా దీనిని తీసుకుంటే సమస్య అదుపులో ఉంటుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)