ఫాలో అయిపోండి

ఈ టిప్స్​ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయట

Published by: Geddam Vijaya Madhuri

హెయిర్ గ్రోత్ కోసం..

జుట్టు రాలడానికి ఎన్ని కారణాలున్నా.. కొన్ని టిప్స్ రెగ్యూలర్​గా ఫాలో అయితే మంచి గ్రోత్ ఉంటుంది. అవేంటో చూసేద్దాం.

మసాజ్

రోజూ రాత్రి తలకు మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల తలలో రక్తప్రసరణ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది.

హీట్ టూల్స్

జుట్టును స్టైల్ చేయడానికి, తడి జుట్టును డ్రై చేయడానికి చాలామంది హెయిర్ టూల్స్ వినియోగిస్తారు. వాటికి ఎంత దూరము ఉంటే జుట్టు అంత పెరుగుతుంది.

మంచి ప్రొడెక్ట్స్

మార్కెట్లో కనిపించినవన్నీ వాడేయడం కాకుండా.. మీ జుట్టుకు ఏది మంచిదో.. వాటిని సెలక్ట్ చేసుకుని హెయిర్​కి వాడితే మంచిది.

ట్రిమ్ చేయండి..

జుట్టు పెరుగుదల మంచిగా ఉండాలంటే జుట్టు చివర్ల ఉండే స్ప్లిట్ ఎండ్స్​ని కట్ చేయాలి. అప్పుడు గ్రోత్ బాగుంటుంది.

బిగించి వేయొద్దు

జుట్టును ముడివేసినప్పుడు, జడ వేసుకునేప్పుడు గట్టిగా వేయకూడదు. ఇలా చేస్తే హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి. జుట్టు డ్యామేజ్ అవుతుంది.

మంచి నీరు

డీహైడ్రేట్ కాకుండా రెగ్యూలర్​గా నీటిని తీసుకోవాలి. దీనివల్ల పొడి జుట్టు దూరమై... జుట్టు హెల్తీగా మారుతుంది.

ప్రోటీన్ తీసుకోవాలి

రెగ్యూలర్​ డైట్​లో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలంటున్నారు. విటమిన్ ఏ, సి, డి, ఈ, జింక్, ఐరన్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే జుట్టు పెరుగుదల మంచిగా ఉంటుంది.