బీపీ ఉన్నవారు బనానా తినొచ్చా? రోజుకు ఎన్ని అరటిపండ్లు తినొచ్చు? అరటిపండులో విటమిన్ బి6, సితో సహా అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి దీనిని అందరూ తినవచ్చు. మరి అధికరక్తపోటుతో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకోవచ్చా? అయితే బీపీ ఉన్నవారు హ్యాపీగా దీనిని తినవచ్చట. దీనిలో పొటాషియం ఉంటుంది. రోజూ మీడియం సైజ్ అరటిపండు తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుందట. దీనిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం రక్తపోటు ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు రోజుకు రెండు నుంచి నాలుగు తీసుకోవచ్చట. దాని సైజ్‌ని మైండ్‌లో ఉంచుకోవాలి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహా తీసుకుని డైట్లో చేర్చుకుంటే మంచిది. Images Source : Pexels