ఈ టిప్స్ ఫాలో అయిపోండి

ఈ జపనీస్ టెక్నిక్స్​తో బద్ధకాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చట..

Published by: Geddam Vijaya Madhuri

ప్రొడెక్టివిటీ పెరుగుతుందట

జపనీస్ టెక్నిక్స్​తో బద్ధకాన్ని ఇట్టే దూరం చేసుకోవచ్చట. దీనివల్ల మీరు చేసే పనిలో ప్రొడెక్టివిటీ పెరుగుతుంది.

ఇకిగై..

మీకు అవసరమైనది.. ఇష్టంగా చేయగలిగేది ఏంటో గుర్తించండి. ఇది మీ లక్ష్యాలను చేరుకునేలా మిమ్మల్ని పుష్ చేస్తుంది. దీనివల్ల సోమరితనం దూరమవుతుంది.

కైజెన్

మీరు చేసే పనిని మెరుగుపరుచుకునేందుకు చిన్న చిన్న మార్పులు చేయండి. ఇవి మీ పనిలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయి. పర్​ఫెక్ట్​ చేయాలని టైమ్ వేస్ట్ చేసే బదులు స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

పొమోడోరో టెక్నిక్

పనిని విభజించి రెస్ట్ తీసుకోవడం. అరగంటలో 25 నిమిషాలు ఎలాంటి విరామాలు లేకుండా వర్క్ చేసి.. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం చేయాలి. దీనివల్ల పని త్వరగా పూర్తి అవుతుంది.

హరహచింబు

ఫుడ్​ ఎక్కువగా తీసుకోకండి. ఇది మీలో బద్ధకాన్ని పెంచేస్తుంది. మీ కడుపు 80 శాతం నిండితే దానిని అక్కడితో ఆపేయండి. వంద శాతం తినేస్తే అది మీలో సోమరితనాన్ని పెంచుతుంది.

షోషిన్

చేసే ప్రతి పనిని క్యూరియాసిటీతో.. కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే కోరికతో చేస్తే పని త్వరగా పూర్తి అవుతుంది. దీనివల్ల పనులు వాయిదా వేయకుండా యాక్టివ్​గా ఉంటారు.

వాబిసాబి

మీరు చేసే పనిలో తప్పులు గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. అంతేకానీ తప్పులు చేశామని ఒత్తిడి తీసుకోకూడదు.

సీరీ

మీ రూమ్​ని, వర్క్​ చేసే ప్లేస్​ని ఎంత నీట్​గా ఉంచుకుంటే అంత ప్రొడెక్టివిటీ పెరుగుతుంది. చిందరవందరగా ఉంటే మీ మైండ్​కూడా అంత డిస్టర్బ్డ్​గా ఉంటుందట.

మోనో నో అవేర్

ఉన్న టైమ్​ని సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే టార్గెట్ కంప్లీట్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి.

ఈ టిప్స్​తో..

ఈ టెక్నిక్స్ బద్ధకాన్ని వదిలించుకోవడంలో బాగా హెల్ప్ చేస్తాయి. మీ పనిలో మెరుగైన ఫలితాలు అందిస్తాయి.