హెల్త్ బెనిఫిట్స్

బెండకాయ జ్యూస్​తో కలిగే ప్రయోజనాలు ఇవే..

Published by: Geddam Vijaya Madhuri

అందానికి కూడా..

బెండకాయల్లో న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి కూడా ప్రయోజనాలు అందిస్తాయి. అవేంటంటే.

విటమిన్ సి

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఈ కూడా ఉంటుంది. ఇది కణజాలానికి నష్టం కలిగించకుండా కాపాడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ

బెండకాయ జ్యూస్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించడంతో పాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ మాయం

కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేయడంలో బెండకాయ మెరుగైన ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్​ను దూరం చేస్తుంది.

క్యాన్సర్ కారకాలు దూరం

దీనిలోని విటమిన్ కె యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మంటను, వేడిని తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలను యాంటీ ఆక్సిడెంట్లు దూరం చేస్తాయి.

హెల్తీ స్కిన్ కోసం

బెండకాయల్లోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి. రెగ్యూలర్​గా తీసుకుంటే చర్మానికి చాలా మంచిది. జుట్టు పెరుగుదలకు కూడా మంచిది.

కంటి చూపునకు

దీనిలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కండరాలకు కూడా ఇది చాలా మంచిదంట.

మధుమేహముంటే

బెండకాయలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ షుగర్​ని అదుపులో ఉంచుతాయి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Pinterest)