కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను గంటల తరబడి చూడకూడదు.

చాలా రోజులు తలనొప్పి, కళ్లు పొడిబారడం తీవ్రమైన కంటి సమస్యలకు సంకేతం.

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవాలి.

కంటి సమస్యలకు సొంత వైద్యం చేసుకోకూడదు. తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి.

సిఫార్సు చేయని ఐ డ్రాప్స్ కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది.

ఎండలో తిరిగితే యూవీ ఏ, యూవీ బీ రేడియేషన్‌ నుంచి కాపాడే గ్లాసెస్ వాడాలి.

40 ఏండ్ల లోపు వాళ్లు రెండేళ్లకు ఓసారి, 40 దాటిన వాళ్లు ఏడాదికి ఓసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com