లైంగిక సామర్థ్యాన్ని తగ్గించే కిల్లర్స్ ఇవే

కొన్ని కారణాలవల్ల కొందరిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. అవి ఏంటంటే..

ఒత్తిడి వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

పార్టనర్​తో సమస్యలు కూడా మానసికంగా కృంగదీసి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

మందు తాగే అలవాటు ఉండేవారిలో క్రమేణా లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది.

నిద్ర సమస్యలున్నవారు కూడా లైంగికంగా యాక్టివ్​గా ఉండలేరని పలు అధ్యయనాలు తెలిపాయి.

బర్త్ కంట్రోల్ పిల్స్, బీపీ మెడిసిన్, హెచ్​ఐవీ డ్రగ్స్ వంటి మందులు కూడా సామర్థ్యాన్ని తగ్గిస్తాయట.

ఒబెసిటీ ఉన్నవారు లైంగికంగా యాక్టివ్​గా ఉండలేరు. ఇది లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కూడా.

వయసు పెరిగేకొద్ది మగవారిలో టెస్టోస్టిరాన్ తగ్గుతుంది. దీనివల్ల లైంగికవాంఛలు తగ్గుతాయి.

మోనోపాజ్​ దశలో ఆడవారిలో కూడా ఈ లైంగిక సామర్థ్యాలు తగ్గిపోతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది. (Image Source : Envato)