గుడ్డు, పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలా మంచిదట.. ఈ మాస్క్​లో అది కూడా వేస్తే

గుడ్లు, పెరుగును కలిపి కొందరు జుట్టుకు అప్లై చేస్తుంటారు. దీనివల్ల జుట్టుకి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ఈ మాస్క్​లో ఆముదాన్ని కూడా వేసి కలిపి అప్లై చేస్తే జుట్టుకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయి.

ముఖ్యంగా చుండ్రు సమస్య ఉన్నవారికి ఈ మాస్క్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

గుడ్లులోని ప్రోటీన్ హెయిర్ ఫోలికల్స్​ను స్ట్రాంగ్​గా చేస్తుంది. పెరుగు కూడా చుండ్రును తొలగిస్తుంది.

ఓ గుడ్డులో కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ ఆముదం వేసి.. మరో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి.

ఇవన్నీ మంచి పేస్ట్​ వచ్చేవరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తేనే మాస్క్​ను ఈజీగా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.

ఈ మాస్క్​ను 40 నిమిషాలు ఉంచుకోవాలి. అప్పటివరకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి.

దీనిని జుట్టుకు, స్కాల్ప్​కి ఫుల్​గా పేస్ట్​ను అప్లై చేసి.. కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి.

అనంతరం గోరువెచ్చని నీటితో, మైల్డ్​ షాంపూను ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకోవాలి.

వారానికోసారి ఈ మాస్క్​ని అప్లై చేస్తే చుండ్రు తగ్గుతుంది.

అలాగే జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అంది స్ట్రాంగ్​గా మారుతుంది.