ఒక్కో బతుకమ్మకి ఒక్కో నైవేద్యం.. మీకు తెలుసా?
మొదటిరోజు అమ్మవారికి నువ్వులపొడిలో పంచదారను వేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండోరోజు బతుకమ్మకు బెల్లంపాకంలో నానబెట్టిన అటుకులు వేసి నైవేద్యంగా పెడతారు.
మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ముద్దపప్పును చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.
నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఈరోజు పరమాన్నం చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ఐదో రోజు అట్ల బతుకమ్మగా పిలుస్తారు. ఆరోజు అమ్మవారికి అట్లు వేసి నైవేద్యంగా పెడతారు.
ఆ రోజు బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోరు. నైవేద్యం కూడా సమర్పించరు. అందుకే అలిగిన బతుకమ్మగా పిలుస్తారు.
ఏడోరోజున వేపకాయల బతుకమ్మను చేసుకుంటారు. సర్వపిండిని వేపకాయల రూపంలో చేసుకుని నైవేద్యంగా పెడతారు.
ఎనిమిదో రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా చెప్తారు. బియ్యం పిండితో ఉండలు చేసి డీప్ ఫ్రై చేశాక.. వాటిని బెల్లంపాకంలో వేస్తారు.
బతుకమ్మలో ఇదే ఆఖరు రోజు. దీనినే సద్దుల బతుకమ్మగా చెప్తారు. ఆరోజు పులిహోర, దద్దోజనం, మలీద ఉండలు చేసి నైవేద్యంగా పెడతారు.
ఇలా తొమ్మిది రోజులు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు చేసి సమర్పిస్తారు. ఆఖరు రోజున నిమజ్జనం చేస్తారు.