ప్రెగ్నెన్సీ సమయంలో తినకూడని ఫుడ్స్ ఇవే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ ఎలా తీసుకోవాలో.. కొన్ని ఫుడ్స్ అలా తీసుకోకూడదు. ఇంతకీ ఏ ఫుడ్స్ తీసుకోకూడదు. వాటివల్ల ఎలాంటి నష్టాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాటీ ఫిష్‌లు తీసుకోకపోవడమే మంచిది. వీటిలోని మెర్క్యూరీ లెవల్స్ బేబి నరాలను డ్యామేజ్ చేసే అవకాశముంది. కాఫీ తాగే అలవాటును మానేస్తే మంచిది. ఇవి తల్లి, బేబి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గుడ్లు తినొచ్చు కానీ.. పచ్చి గుడ్లు తీసుకోకూడదు. దీనిలోని బ్యాక్టీరియా బేబి హెల్త్‌ని ఇబ్బంది పెడుతుంది. హాట్ డాగ్స్, ప్రొసెస్ చేసిన మీట్స్ తినకూడదు. ఇవి అబార్షన్‌కు దారి తీయవచ్చు. శుభ్రంగా కడగని ఫ్రూట్స్, వెజిటెబుల్స్ తీసుకోకూడదు. కడిగిన తర్వాతే తినాలి. మద్యం, షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కూడా అంత మంచివి కాదు. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Pinterest)