యాంటీ డిప్రెసెంట్స్ వాడకం వల్ల ఈ దుష్ప్రభావాలు ఉంటాయి

యాంటీ డిప్రెసెంట్స్ మానసిక స్థితిని మెరుగు చేయడంలో దోహదం చేస్తాయి. వీటితో కొన్ని దుష్ప్రభావాలు తప్పకుండా ఉంటాయి.

ఒక్కోరకం మెడిసిన్ మనపై ఒక్కో విధంగా దుష్ప్రభావం చూపుతాయి. కొన్నింటి వల్ల తీవ్రత అధికంగా ఉండనుంది

చికిత్స మొదలు పెట్టిన తొలిరోజుల్లో కొంత మందిలో వికారం, విరేచనాలు, మలబద్దకం, కడుపులో క్రాంప్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి

సెలెక్టివ్ సెరోటినిన్ రీ ఆప్టెక్ ఇన్హిబీటర్స్, ట్రై సైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ వంటి మెడిసిన్ వాడకం వల్ల బరువు పెరగవచ్చు.

ఈ మందుల ప్రభావం వల్ల కోరిక తగ్గడం, లైంగిక తృప్తి లేకపోవడం, పురుషుల్లో అంగస్తంభన సమస్యలు వేధిస్తాయి.

కొన్ని యాంటీడిప్రెసెంట్స్ మీ మూడ్ ని ఉత్తేజితం చేస్తాయి. కొన్నింటి వల్ల నీరసంగా, మగతగా ఉండే ప్రమాదం సైతం ఉంటుంది.

కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లు స్టిమ్యూలేటింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.

కొన్ని మందులతో సెరెటోనిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి పోతే ప్రాణాంతక స్థితి కలగవచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి

మెడిసిన్ వల్ల దుష్ప్రభావం కనిపిస్తే డాక్టర్ సూచన మేరకు ఆ మందులు మార్చుకోవడం లేదా వాడే మోతాదుల్లో మార్పులు చేసుకోవడం అవసరం.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్‌ను సంప్రదించకుండా ఇలాంటి మెడిసిన్ వాడకపోవడం శ్రేయస్కరం