సింపుల్ టిప్స్

వర్షాకాలంలో వైరల్ ఫీవర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

వైరల్ జ్వరాలు

వర్షాలు, వరదల కారణంగా వైరల్ ఫీవర్స్ ఎక్కువైతున్నాయి. పైగా వాతావరణం కూడా జ్వరాల వ్యాప్తికి అనుగుణంగా ఉంది.

జాగ్రత్తలు తీసుకోవాలి..

ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల వైరల్ ఫీవర్లు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

హోమ్ రెమిడీస్

కొన్ని ఇంటి చిట్కాలు ఫీవర్ తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల ఫీవర్ తగ్గి రిలీఫ్ ఉంటుంది.

హైడ్రేటెడ్​గా ఉండాలి..

రెగ్యూలర్​గా నీటిని తీసుకోవాలి. హెర్బల్ టీలు, సూప్స్ శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి. ఇవి జ్వరానికి వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తాయి.

రెస్ట్ ముఖ్యం..

ఫీవర్​ వచ్చినా రాకున్నా.. నిద్ర కనీసం 7 లేదా 8 గంటలు ఉండేలా చూసుకోండి. దీనివల్ల శరీరం త్వరగా రికవర్​ అవుతుంది.

శుభ్రత

చేతులను రెగ్యూలర్​గా వాష్ చేసుకోవాలి. మీ చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. వైరస్​లు వ్యాపించవు.

న్యూట్రిషన్ ఫుడ్

ఫ్రూట్స్, వెజిటెబుల్స్ వంటి త్వరగా జీర్ణమయ్యే న్యూట్రిషనల్ ఫుడ్స్​ని తీసుకుంటే హెల్తీగా ఉంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వైద్యుల సూచనలు

ఫీవర్ వచ్చినా రాకున్నా.. వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉంటే కొన్నిరకాల వ్యాధులు రాకుండా హెల్తీగా ఉండేందుకు హెల్ప్ అవుతుంది.

అవగాహన కోసమే

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.