బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్

టీచర్స్​కి గిఫ్ట్​ ఇవ్వాలి అనుకుంటున్నారా? బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఐడియాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

లో బడ్జెట్ గిఫ్ట్స్

స్టూడెంట్స్​ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండవు. కాబట్టి టీచర్స్​ డే సందర్భంగా 100, 200లో ఈ మంచి గిఫ్ట్స్ కొని.. టీచర్స్​కి ఇచ్చి ఇంప్రెస్ చేయొచ్చు.

కాఫీ మగ్

పర్సనలైజ్ చేసిన లేదా కస్టమైజ్ చేయించిన మగ్​ని టీచర్​కి ప్రెజెంట్ చేయొచ్చు. ఇది బడ్జెట్ తక్కువగానే ఉంటుంది. ఈ మగ్​పై మీరు మెసేజ్​ కూడా రాయొచ్చు.

పువ్వులు

పువ్వులను ఇచ్చి టీచర్స్ డే విషెష్ చెప్పొచ్చు. ఫ్రెష్​గా ఉండే పువ్వులు లేదా బుకెను తీసుకుని టీచర్స్​కి ఇవొచ్చు.

గ్రీటింగ్ కార్డ్

మీ హ్యాండ్ రైటింగ్​తో.. క్రియేటివిటీని ఉపయోగించి గ్రీటింగ్ కార్డ్ తయారు చేయొచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టు.. గ్రీటింగ్​ కార్డ్​కి సంబంధించిన ఐటమ్స్ కొని దానిని తయారు చేయొచ్చు.

చాక్లెట్స్..

టీచర్స్ చాక్లెట్ ఇవ్వొచ్చు. కొందరు టీచర్స్ చాక్లెట్ తినకపోయినా వాటిని తీసుకుని ఇంటికి వెళ్తారు. వాళ్ల పిల్లలకు ఇచ్చినా హ్యాపీగా ఫీలవుతారు. కాబట్టి చాక్లెట్ కొనండి.

బుక్​

టీచర్​కి ఇష్టమైన బుక్ లేదా ఆమె సబ్జెక్ట్​కి సంబంధించిన బుక్​ను కొని మేడమ్​ లేదా సార్​కి గిఫ్ట్​గా​ ఇవ్వొచ్చు.

ఫోటో ఫ్రేమ్

టీచర్​తో కలిసి ఉన్న ఫోటోను లేదా టీచర్స్ చిన్న నాటి ఫోటోలు.. లేదంటే బ్యూటీ ఫుల్ కోట్స్​తో ఫోటో ఫ్రేమ్ కట్టించి గిఫ్ట్​గా ఇవ్వొచ్చు.

పెన్స్

టీచర్స్​కి అవసరమైన వస్తువుల్లో పెన్స్ ఒకటి. కాబట్టి పెన్​ సెట్ లేదా.. పెన్ హోల్డర్ తీసుకుని వారికి గిఫ్ట్​గా ఇస్తే ఉపయోగపడుతుంది.

నో ఇష్యూష్

టీచర్స్​కి గిఫ్ట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా వాళ్లు మిమ్మల్ని ఒకేలా ట్రీట్ చేస్తారు. చిన్న విష్ చేసినా వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు