నైవేద్యం

వినాయకచవితి ప్రసాదాల్లో పంచకజ్జాయ ఒకటి. దీనిని కొందరు రెగ్యూలర్​గా పూజకు చేసుకుని నైవేద్యంగా పెడతారు.

Published by: Geddam Vijaya Madhuri

సింపుల్ రెసిపీ

సింపుల్​గా, టేస్టీగా చేసుకోగలిగే రెసిపీల్లో పంచకజ్జాయ కూడా ఒకటి. పండుగ రోజు సమయయాన్ని ఆదా చేసే రెసిపి ఇది.

కావాల్సిన పదార్థాలు

రెండు కప్పుల అటుకులు, అర కప్పు బెల్లం, చిటికెడు యాలకుల పొడి, టేబుల్స్ స్పూన్ నజీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్స్, నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్.

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో నెయ్యి వేసి కరగనివ్వాలి.

డ్రై ఫ్రూట్స్ రోస్ట్

నెయ్యి కాగిన తర్వాత దానిలో జీడిపప్పు, కిస్​మిస్ వేసి బంగారు రంగు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కడాయి నుంచి తీసేయాలి.

కొబ్బరి తురుముతో..

అదే కడాయిలో కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. కొందరు పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకుంటారు. ఇది గోల్డెన్ కలర్ వచ్చేవరకు రోస్ట్ చేసుకోవాలి.

బెల్లం పాకం..

కడాయిలో బెల్లం వేసి.. కొద్దిగా నీళ్లు వేసి కరగనివ్వాలి. బెల్లం కరిగి జిగురుగా మారినపప్పుడు స్టౌవ్ ఆపేయాలి.

మిక్సింగ్..

ఇప్పుడు ఓ ప్లేట్​లో అటుకులు తీసుకోవాలి. కొబ్బరి తురుము, వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షలు వేసి కలపాలి.

ఫైనల్ టచ్

దీనిలో యాలకుల పొడి బెల్లం సిరప్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే వినాయక చవితి స్పెషల్ పంచకజ్జాయ రెడీ.

వినాయక చవితి ప్రసాదాల రెసిపీల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Images Source : Instagram)