ఈ విషయం తెలుసా?

పిల్లలకు కొబ్బరి తినిపించొచ్చా? లేదా?

Published by: Geddam Vijaya Madhuri

సూపర్ ఫుడ్

కొబ్బరి న్యూట్రిషన్స్​తో నిండి ఉంటుంది. అంతేకాకుండా దీనిని సూపర్​ ఫుడ్​గా చెప్తారు.

ఎదిగే పిల్లలకు మంచిది

కాబట్టి దీనిని పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా పెట్టొచ్చట. ఇది పిల్లల ఎదుగుదలకు మంచిదంటున్నారు.

మెదుడును చురుకుగా చేస్తుంది

బ్రెయిన్ డెవలప్​మెంట్​ను ప్రోత్సాహించి.. పిల్లలు చురుకుగా ఉండేలా చేయడంలో కొబ్బరి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు.

ఎముకలకు మంచిది

ఎముకలను దృఢంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలకు బలాన్ని చేకూర్చి పిల్లల ఎదుగుదలను ప్రమోట్ చేస్తుంది.

ఇమ్యూనిటీని పెరుగుతుంది

రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది కాబట్టి.. రెగ్యూలర్​గా వారి డైట్​లో దీనిని కలిపి లిమిటెడ్​గా ఇవ్వొచ్చు.

హైడ్రేషన్ కోసం

కొబ్బరి నీళ్లు హైడ్రేటెడ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. కొబ్బరి నీళ్లల్లోని ఎలక్ట్రోలైట్స్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

జీర్ణ సమస్యలు దూరం

పిల్లల్లోని జీర్ణ సమస్యలను ఇవి దూరం చేస్తాయి. పైగా కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.

హెల్తీ స్కిన్ కోసం

కొబ్బరి స్కిన్​ను హెల్తీగా హైడ్రేటెడ్​గా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనె శరీరంపై ఉన్న ర్యాష్, దద్దుర్లను తగ్గిస్తుంది.

బరువును కంట్రోల్ చేయడంలో..

పిల్లలకు శక్తిని అందించి.. వారి బరువును మ్యానేజ్ చేయడంలో కొబ్బరి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి వారికి దీనిని ఇవ్వొచ్చు.

అవగాహన కోసమే..

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Pinterest)