జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేసే ఫుడ్స్ ఇవే
వర్షాకాలంలో, వివిధ కారణాలతో జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఈ సమయంలో డైట్లో కొన్ని మార్పులు చేయాలి.
కొన్నిరకాల ఫుడ్స్ జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి పెరుగుదలను ప్రోత్సాహిస్తూ ఉంటాయంటున్నారు నిపుణులు.
కొబ్బరిలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి కండీషన్ ఇచ్చి.. కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ చేస్తాయి.
బాదంలో బయోటిన్, విటమిన్ ఈ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహించి.. రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి.
ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్‌తో నిండిన ప్రోటీన్, ఫైబర్, చియాసీడ్స్ స్కాల్ప్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. హెల్తీ, స్ట్రాంగ్ జుట్టుకు హెల్ప్ చేస్తుంది.
గుడ్లులో ప్రోటీన్, బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచిది.
బీటా కెరోటిన్ చిలగడ దుంపల్లో ఉంటుంది. ఇది సెబమ్‌ని ఉత్పత్తి చేసి..హెల్తీ హెయిర్‌ని అందిస్తుంది. పొడి జుట్టును దూరం చేస్తుంది.
యోగర్ట్‌లో ప్రోటీన్, విటమిన్ బి5 ఉంటుంది. ఇది జుట్టును స్ట్రాంగ్ చేస్తుంది. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది.
వీటిలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది స్కాల్ప్‌కి చాలా మంచిది. జుట్టు పెరుగుదలను ఇది ప్రోత్సాహిస్తుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Envato)