వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి.
దోమల వ్యాప్తితో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు సోకుతాయి.
కొన్ని మందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.
రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల ముప్పు నుంచి కాపాడుకోవచ్చు.
వర్షాకాలంలో సిట్రస్ పండ్లు అధికంగా తీసుకోవాలి.
అల్లం, వెల్లుల్లి, పసుపు, తాజా ఆకుకూరలు, కూరగాయలను తినాలి.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
దోమలు కరువకుండా మస్కిటో కాయిల్స్ వాడాలి.