షుగర్ టెస్ట్‌కి ఏ వేలి నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకుంటే బెటరో తెలుసా?

Published by: Ram Manohar
Image Source: Pixabay

ఏ వేలికి చేస్తే బెటర్

చూపుడు వేలు, బొటన వేలుకి కాకుండా మిగతా వేళ్ల నుంచి బ్లడ్ శాంపిల్ తీస్తే బెటర్.

Image Source: Pixabay

ఇలా చేస్తే అక్యురేట్‌

మధ్య, చిటికెన వేళ్ల చివర్ల నుంచి రక్తం తీస్తే షుగర్ లెవెల్స్ అక్యురేట్‌గా తెలుస్తాయి.

ఆ చివర్లలో రక్తం ఎక్కువ

ఈ వేళ్ల చివర్లలో రక్తం ఎక్కువగా ఉంటుందట. అందుకే అక్కడి నుంచే శాంపిల్ తీసుకోవాలి.

ఇలా చేస్తే నొప్పి ఉండదు

ఒక్కోసారి ఒక్కో వేలి నుంచి శాంపిల్ తీస్తే రీడింగ్ కచ్చితంగా ఉండడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది.

Image Source: Freepik

చేతులు కడుక్కోవాలి

టెస్ట్ చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పూర్తిగా ఆరిన తరవాతే శాంపిల్ తీసుకోవాలి.

Image Source: Pixabay

రికార్డ్ చేసుకోవడం మంచిది

ఈ రీడింగ్స్‌ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ అంటున్నారు వైద్యులు.

ఎక్కువ మొత్తంలో వద్దు

ఎక్కువ మొత్తంలో శాంపిల్‌ని తీసుకోవడమూ సరికాదు. ఇలా చేస్తే రీడింగ్ సరిగ్గా రాకపోవచ్చు.