కడుపు ఉబ్బరాన్ని తగ్గించే సహజమైన ఫుడ్స్ ఇవే వివిధ కారణాల వల్ల చాలామందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీనివల్ల కంఫర్ట్‌గా ఉండలేరు. దీనివల్ల కడుపులో గ్యాస్ పెరిగి జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు. ఓ గ్లాస్ నీటిలో జీలకర్ర వేసి రాత్రుళ్లు నానబెట్టి ఉదయాన్నే తాగితే సమస్య తగ్గి.. మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. బొప్పాయిని నేరుగా తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా.. ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి. పుదీనా టీ లేదా నేరుగా పుదీనాను తిన్నా కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. ప్రోబయోటిక్స్ కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యోగర్ట్, పులిసిన పదార్థాలను డైట్లో చేర్చుకోవాలి. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేసి గట్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి. చమేలి టీ కూడా జీర్ణ సమస్యలను దూరం చేసి.. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Enavto)