ఈ ఇంటి చిట్కాలు తెలుసా?

మాడిపోయిన గిన్నెలను ఇలా ఈజీగా శుభ్రం చేసేయండి

Published by: Geddam Vijaya Madhuri

గిన్నెలు అడుగు పడితే

కొన్ని సందర్భాల్లో వంటచేసేప్పుడు గిన్నెలు మాడిపోవడం, అడుగుపట్టడం జరుగుతుంటాయి. ముఖ్యంగా స్టీల్ గిన్నెలు ఈజీగా మాడిపోతూ ఉంటాయి.

హోమ్ రెమిడీస్

ఇలా మాడిపోయిన స్టీల్ గిన్నెలను శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వీటిని శుభ్రం చేసేందుకు మహిళలు చాలా కష్టపడుతుంటారు.

బేకింగ్ సోడాతో..

బేకింగ్ సోడాను ఉపయోగించి స్టీల్​ గిన్నెలకు అంటిన మాడును సులభంగా వదిలించవచ్చు. బేకింగ్ సోడాను పేస్ట్ చేసి.. దానిని మాడుపై ఉంచి.. రాత్రంతా ఉంచాలి.

రాత్రంతా నానబెట్టాలి..

రాత్రంతా బేకింగ్ సోడాతో నానబెడితే ఉదయాన్నే శుభ్రం చేస్తే ఈజీగా వదిలిపోతుంది. డిష్​వాష్ సబ్బుతో క్లీన్ చేస్తే సరిపోతుంది.

కోక్​తో శుభ్రం చేయొచ్చు..

కొకోలాలోని ఎసిడిక్ క్వాలిటీ స్టీల్​ గిన్నెలకు పట్టిన మాడును వదిలిస్తుంది. కోక్​ జిడ్డును, మాడును, బర్న్ అయిన వంటలను ఈజీగా చేస్తుంది.

ఎలా శుభ్రం చేయాలంటే..

కోక్​ను మాడిపోయిన గిన్నెల్లో వేసి ఉడికించాలి. అది కాస్త చల్లారిన తర్వాత స్క్రబ్​ చేస్తే గిన్నెలకు అంటుకున్న మాడు ఈజీగా వదులుతుంది.

నిమ్మరసంతో..

నిమ్మరసంలో ఒకటి కలిపి స్టీల్ గిన్నెలకు అంటుకున్న మాడు వదిలించవచ్చు. నిమ్మరసంలో ఉప్పు కలిపి దానిని మాడుతో కలపాలి.

ఎలా శుభ్రం చేయాలంటే..

నిమ్మరసంలో ఉప్పు వేసి బాగా కలిపి.. దానిని మాడుపై వేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం దానిని స్క్రబ్​ చేస్తే మాడు వదిలిపోతుంది.

టోమాటో సాస్​తో

టోమాటో సాస్​ను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే దీనితో ఇంకో ప్రయోజనముందని తెలుసా? అదేంటంటే.. గిన్నెలకు పట్టుకున్న మాడును దీనితో సింపుల్​గా వదిలించవచ్చు.

ఎలా శుభ్రం చేయాలంటే..

ముందుగా మాడు పట్టిన పాత్రలో నీళ్లు వేసి దానిలో టోమాటో సాస్​ వేసి.. దానిని ఉడికించాలి. చల్లారిన తర్వాత స్క్రబ్ క్లీన్ చేస్తే మాడు ఇట్టే వదిలిపోతుంది.

డిష్ వాష్​తో..

మాడిపోయిన గిన్నెలను డిష్​వాష్​తో కూడా సింపుల్​గా క్లీన్ చేయొచ్చు. గిన్నెలో నీళ్లు వేసి డిష్ వాష్ లిక్విడ్ వేసి ఉడికించి.. చల్లారక క్లీన్ చేస్తే సరి.