ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ ఇవే
కొన్ని ఫుడ్స్‌ని రెగ్యూలర్‌గా తీసుకుంటే ఊపిరితిత్తులకు చాలా మంచివి అంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటంటే..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఊపిరితిత్తులకు చాలా మంచివి. పాలకూర, కాలే వంటి ఆకు కూరలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.
బెర్రీలు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, ద్రాక్షలు, నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్ల ఫుడ్‌లలో భాగమే. బ్రోకలీ, కాలీ ఫ్లవర్, స్ప్రౌట్స్, టోమాటోలు వంటివి కూడా ట్రై చేయవచ్చు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. లంగ్స్ హెల్త్‌కి కూడా మంచివి. ఫ్యాటీ ఫిష్లను తీసుకోవచ్చు. సాల్మన్, టూనా వంటి చేపలు తినొచ్చు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్‌లో పసుపు, అల్లం, ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవచ్చు. క్వినోవా, బ్రౌన్ రైస్, గోధుమలు కూడా మంచి ఆప్షన్స్.
విటమిన్ సి మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఇమ్యూనిటీతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బొప్పాయి, పైనాపిల్, కివి, బెల్ పెప్పర్స్, అవకాడో వంటి ఫుడ్స్ విటమిన్ సికి బెస్ట్ ఆప్షన్.
ఓమేగా 3 రిచ్ ఫుడ్స్ బ్రెయిన్ హెల్త్‌తో పాటు.. ఊపరితిత్తుల ఆరోగ్యానికి కూడా చాలామంచివి. వీటికోసం వాల్ నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఫ్యాటీ ఫిష్‌లు తీసుకోవచ్చు.
చిలగడ దుంపలు, క్యారెట్స్, గుమ్మడికాయ, గ్రీన్ టీ వంటి ఫుడ్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచివి.
ప్రొసెస్ చేసిన మీట్స్, షుగర్ డ్రింక్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్రైడ్ ఫుడ్స్, సోడియం ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉంటే మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Pinterest)