జాగ్రత్త

బీపీని పెంచే కారకాలు ఇవే..

Published by: Geddam Vijaya Madhuri

పెరుగుతున్న మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా బీపీతో ఎందరో మరణానికి గురవుతున్నారు. దీనివల్ల గుండె సమస్యలు, బ్రెయిన్​, కిడ్నీ సమస్యలు పెరిగి ఇవి మరణానికి దారి తీస్తున్నాయి.

ఈ టిప్స్ ఫాలో అయితే

అందుకే కొన్ని రెగ్యూలర్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుందంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..

ఒత్తిడి

ఒత్తిడి పెరిగితే బీపీ కూడా పెరుగుతుంది. అందుకే దానికి గల కారణాలు గుర్తించి ఒత్తిడిని తగ్గించుకోవాలంటున్నారు. యోగా, బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​ల వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

కెఫీన్

కొందరు ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు. కానీ కాఫీ బీపీని పెంచడంతో పాటు గుండె సమస్యలను కూడా ఇది పెంచుతుందంటున్నారు. అందుకే దానికి దూరంగా ఉండాలి.

హెల్తీ డైట్

కొందరు ప్రాసెస్ చేసిన, షుగర్ ఎక్కువుండే ఫుడ్స్​ని ఎక్కువగా తింటారు. అన్​హెల్తీ ఫ్యాట్స్ బ్లెడ్ ప్లెజర్​ని ఎక్కువ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.

ఉప్పు తగ్గించాలి..

కొందరు ప్రతిదాంట్లోనూ ఉప్పు వేసుకుంటూ ఉంటారు. దీనిని ఎంత తగ్గిస్తే బీపీ అంత కంట్రోల్​లో ఉంటుందంటున్నారు నిపుణులు.

మద్యం

మద్యం తాగే అలవాటు ఉంటే దానిని వీలైనంత త్వరగా మానాలి. మానలేని స్థితిలో తగ్గించడానికైనా ట్రై చేయండి. దీనివల్ల బీపీ పెరిగి దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి.

స్మోకింగ్

మందు తాగడం కన్నా స్మోకింగ్ ఇంకా డేంజర్ అంటున్నారు. ఇది లోపలి నుంచి శరీరాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. బీపీతో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు పెరుగుతాయి.

యాక్టివ్​గా ఉండాలి

బద్ధకంగా ఓ మూలకు ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా బీపీ ఉండేవారు కచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్టివ్​గా ఉండాలి.

బరువు

బీపీ ఉన్నా లేకున్నా బరువును అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇవి గుండె, మధుమేహ సమస్యలను మరింత పెంచుతాయి.

మధుమేహం

బీపీకి మధుమేహాన్ని జంటపక్షిగా చెప్తారు. షుగర్ రానంతవరకే ఏదైనా. వస్తే మాత్రం పరిస్థితి మీ చేయి జారిపోతుంది. కాబట్టి షుగర్​ని ఎప్పుడూ కంట్రోల్​లో ఉంచుకోవాలి.

అవగాహన కోసమే

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Pinterest)