లైంగిక చర్యవల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఇవే వివిధ కారణాలవల్ల కొందరు లైంగిక జీవితానికి దూరంగా ఉంటారు. కానీ దీనిలో యాక్టివ్‌గా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒత్తిడిని తగ్గించి మంచి హార్మోన్లను విడుదల చేస్తాయట. ఇది మిమ్మల్ని రిలాక్స్‌గా ఉండేలా చేస్తుంది. మెరుగైన నిద్రను ప్రోత్సాహిస్తుందట. లైంగిక చర్య ద్వారా ప్రోలాక్టిన్ విడుదలై మంచి నిద్ర వస్తుందట. రోగనిరోధక శక్తిని పెంచి.. కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు.. సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. పీరియడ్ సమస్యలను దూరం చేస్తుంది. ఆడవారిలో ఉండే హార్మోనల్ సమస్యలను తగ్గిస్తుంది. ఆక్సిటోసిన్, డోపమైన, ఎండార్ఫిన్స్‌ను విడుదల చేసి.. మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది. (Images Source : Pixabay)