బ్యూటీ టిప్స్

ఈ స్కిన్ కేర్ రోటీన్​తో 50 ఏళ్లు వచ్చిన యవ్వనంగా కనిపించొచ్చు

Published by: Geddam Vijaya Madhuri

స్కిన్ కేర్ రోటీన్

చాలామంది దీనిని ఇగ్నోర్ చేస్తారు. కానీ సింపుల్, బేసిక్ థింగ్స్​ని ఇగ్నోర్ చేయకుండా రెగ్యూలర్​గా ఫాలో అయితే హెల్తీ స్కిన్​ని మెయింటైన్ చేయొచ్చు.

మంచి నిద్ర

మంచి నిద్ర అనేది ఆరోగ్యాన్ని, అందాన్ని ప్రమోట్ చేస్తుంది. డార్క్ సర్కిల్స్, ముఖంపై వాపు లాంటివి ఉండవు. కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోవాలి.

ఫేస్ మాస్క్

కీరదోసలను పేస్ట్ చేసి దానిని ముఖానికి అప్లై చేస్తూ ఉండాలి. ఇది యాంటీ ఏజింగ్ మాస్క్​. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేయడంతో పాటు ముఖాన్ని స్మూత్​గా ముడతలు లేకుండా చేస్తుంది.

క్లెన్సింగ్..

ముఖాన్ని క్లెన్సర్​తో రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. ఇది స్కిన్​పై ఉన్న డెడ్ సెల్స్​ని దూరం చేసి ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.

టోనింగ్..

ముఖాన్ని వాష్ చేసుకున్న తర్వాత, మేకప్​కి ముందు కచ్చితంగా టోనర్ అప్లై చేయాలి. ఇది హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. మేకప్​కి స్కిన్​కి వారధిగా ఉంటుంది.

మాయిశ్చరైజర్

పొడి చర్మం ఉంటే వృద్ధాప్యఛాయలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా, ముందుగా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు తమ స్కిన్​కి తగ్గట్లు మాయిశ్చరైజర్​ని ఎంచుకోవాలి.

హైడ్రేషన్

రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగితే మంచిది. దీనివల్ల స్కిన్ హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా పింపుల్స్ తగ్గుతాయి.

యోగా

యోగా ముఖంలో మంచి గ్లోని ప్రమోట్ చేస్తుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల స్కిన్​ యవ్వనంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.