కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా భోజనం చేయాలి. హడావిడిగా ఫుడ్ తినకూడదు.
కర్రీ టేస్టీని బట్టి ఎక్కువ, తక్కువ భోజనం చేయకూడదు. బాడీకి అవసరమైనంత ఫుడ్ తీసుకోవాలి.
ఆహారం వేడిగా, తాజాగా ఉన్నప్పుడే తినాలి. నిల్వ చేసిన ఫుడ్ తీసుకోకూడదు.
భోజనంలో రసం, మజ్జిగ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.
కొంతమందికి కొన్ని ఫుడ్స్ తింటే ఎలర్జీ సమస్యలు వస్తాయి. అలాంటి వారు పడనిఫుడ్స్ తినకూడదు.
ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.
టైమ్ లేదని.. టేస్టీగా లేదని.. ఫుడ్ స్కిప్ చేస్తారు. అలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది.
రోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. టైమ్ మార్చడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.