నిమ్మకాయలను అలా తీసుకుంటే బరువు తగ్గొచ్చట తెలుసా?

బరువు తగ్గాలనుకునేవారు ప్రయత్నించని రెసిపీలు ఉండవు.

కొందరు జిమ్​లు, వ్యాయామాలతో బరువు తగ్గేందుకు చూస్తే మరికొందరు డైట్స్​తో బరువు తగ్గాలనుకుంటారు.

మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు నిమ్మకాయతో బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకోండి.

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

పరగడుపునే నిమ్మకాయలో సగాన్ని నీటిలో పిండి తాగితే టాక్సిన్లు బయటకు పోయి మెటబాలీజం పెరుగుతుంది.

పసుపులో నిమ్మరసం కలిపి తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది. లివర్ సమస్యలను తగ్గుతాయి.

భోజనం తర్వాత అల్లం రసంలో కలిపి తాగితే జీర్ణసమస్యలు తగ్గి.. హెల్తీగా ఉంటారు.

నిమ్మరసం, అల్లం తురుము, మిరియాలు కలిపి షాట్స్​గా చేసుకుని తాగినా మంచిదే.

సలాడ్స్​లో నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఇలా వివిధ పద్ధతుల్లో నిమ్మరసాన్ని బరువు తగ్గడం కోసం తీసుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది.