స్కిన్ బెనిఫిట్స్

జీలకర్రను ఇలా తీసుకుంటే స్కిన్​కి ఎన్ని ప్రయోజనాలో

Published by: Geddam Vijaya Madhuri

ఈ లక్షణాలుంటాయి

జీలకర్రలో న్యూట్రెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి స్కిన్​కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి.

ఎలా తీసుకోవాలంటే..

స్పూన్ జీలకర్రను తీసుకుని గ్లాస్ నీటిలో వేసి రాత్రి నానబెట్టాలి. వాటిని రాత్రంతా ఉంచి.. ఉదయాన్నే దాన్ని మరిగించి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీనిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్చు.

ఫ్రీ రాడికల్స్

జీరా నీటిలోని రిచ్​ యాక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్​ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. దీనిలోని విటమిన్ ఈ స్కిన్​కి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

డిటాక్స్

సహజంగా స్కిన్​ని డిటాక్స్ చేసి.. చర్మాన్ని క్లియర్​గా చేసే లక్షణాలు జీలకర్ర నీటిలో ఉంటాయి. పరగడుపునే దీనిని తాగితే స్కిన్​కి మంచిది.

స్మూత్​

స్కిన్​ని స్మూత్​గా చేసే యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు దీనిలో ఉంటాయి. దీనివల్ల మెటబాలీజం పెరుగుతుందని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి.

హైడ్రేషన్

స్కిన్​ హైడ్రేటెడ్​గా ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా స్కిన్​కి మంచి గ్లోతో పాటు సహజమైన మెరుపును అందుతుంది.

స్కిన్ ఇన్​ఫెక్షన్స్

ముఖంపై ర్యాష్, స్కిన్ సమస్యలు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి కూడా జీలకర్ర నీటిని తీసుకోవచ్చు.

బెనిఫిట్స్

మీ రోటీన్​తో పాటు దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే స్కిన్ క్లియర్​గా ఉంటుంది. బ్రైట్​గా అవుతుంది. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలుంటాయి.