వెట్టియాన్ హీరోయిన్ మంజూ వారియర్ స్కిన్ కేర్
వెట్టియాన్ పోస్టర్, మనసిలాయో సాంగ్ విడుదలైన తర్వాత మంజూ వారియర్ గురించిన చర్చ సోషల్ మీడియాలో ఎక్కువైంది.
తాజాగా విడుదలైన సాంగ్‌లో చూసిన ఆడియన్స్ ఈమెకు 46 ఏళ్లంటే షాక్ అవుతున్నారు. ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటుందనే తెగ సెర్చ్ చేస్తున్నారు.
మంజూ వారియర్ తీసుకుంటున్న స్కిన్ కేర్ రోటీన్ వృద్ధాప్యఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. ఇంతకీ ఆమె ఎలాంటి కేర్ తీసుకుంటుందంటే..
శరీరానికి హైడ్రేషన్ ముఖ్యం. దీనివల్ల స్కిన్ గ్లో అవుతుంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆమె వీలైనంత హైడ్రేటెడ్‌గా ఉండేందుకు చూస్తుంది.
స్కిన్‌ని క్లెన్స్ చేయడం ఎక్స్ఫోలియేట్ చేస్తుండడం ఉండాలి. మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది. మీ స్కిన్‌కి సూట్ అయ్యే వాటిని ఎంచుకోవాలి.
స్కిన్ కేర్ రోటీన్లో సహజమైన ఫేస్ మాస్క్‌లను మంజూ ట్రై చేస్తారట. యోగర్ట్, తేనె, పసుపు, అలోవెరా జెల్ కలిపి ముఖానికి మాస్క్‌గా వేసుకుంటారని ఇన్‌స్టాలో తెలిపింది.
ఎండలోకి వెళ్లినా వెళ్లకున్నా డైలీ సన్‌స్క్రీన్ ఉపయోగిస్తారట. దీనివల్ల కూడా వృద్ధాఫ్యఛాయలు రాకుండా ఉంటాయి. స్కిన్‌ని ఇవి బ్రైట్‌గా కూడా చేస్తాయి.
కొన్ని సీరమ్స్ వయసును ముఖంలో కనిపించకుండా చేస్తాయి. రెటీనోల్, హల్యూరోనిక్ యాసిడ్, విటమిన్ సి వంటివి వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి.
రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తూ ఉంటే ఫిట్‌గా ఉండడమే కాకుండా స్కిన్‌లో సహజంగానే గ్లో వస్తుంటుంది. మంజూ కూడా రెగ్యూలర్‌గా వ్యాయామాలు చేస్తూ ఉంటారు.
రెగ్యూలర్‌గా ఈ టిప్స్ మీరు ఫాలో అయితే కచ్చితంగా మీ స్కిన్‌లో కూడా మార్పులు చూడవచ్చు. (Images Source : Instagram/manju.warrier)